20-09-2025 06:10:24 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ ను వేరే చోటికి తరలించాలని శనివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ కి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సేకరించిన చెత్త, జంతు కళేబరాలను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రహరీ గోడ ప్రక్కనే పడివేయడంతో విద్యార్థులు దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్ లో ఉండే విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు.అలాగే ఆ ప్రక్కనే ఉన్న మైసమ్మ ఆలయంకు వెళ్ళే దారిలోనే చెత్త,జంతు కళేబరాలు వేయడంతో ఆలయానికి వెళ్ళే భక్తులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు చొరవతిసుకొని డంపింగ్ యార్డ్ నీ వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు.