16-09-2025 12:42:06 AM
ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేర కు హరీశ్ రావు ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందించిన చామల ఎక్స్ వేదికగా.. ‘మీ అధికారం పోయేనాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు ఫు ల్లు.. మీరు పెట్టిన మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు నిల్లు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు ఫుల్లు.. యూనివర్సిటీలు, విద్యాలయాల్లో ఫాకల్టీ నిల్లు.. రెండు దఫాల్లో తెచ్చిన అప్పులు ఫుల్లు..’ అని ఎద్దేవా చేశారు.