calender_icon.png 16 September, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

16-09-2025 12:41:29 AM

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

కోదాడ సెప్టెంబర్ 15 : అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంతోపాటు రూరల్ మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. కోదాడ మండలంలోని గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డి ఎం ఎఫ్ టి నిధులు 20 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిఎంఎఫ్టీ నిధులు 20 లక్షల రూపాయలతో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు.

కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల పరిషత్,R&B, ఇరిగేషన్,మున్సిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారుల తో విడివిడిగా నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న అభివృధి పనులు & సంక్షేమ పథ కాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షించారు.

నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్డీఓ సూర్యనారాయణ, గ్రంథా లయ చైర్మన్ వంగవేటి రామారావు, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, ఎంఈఓ సలీం షరీఫ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహశీల్దార్ వాజిద్ అలీ, నాయకులు పాల్గొన్నారు.