calender_icon.png 2 July, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య

02-07-2025 12:09:40 AM

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వు లు విడుదల చేసింది. లక్ష్మయ్య బుద్ధవనం ప్రాజెక్టు, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారిగా రెండేండ్ల పాటు కొనసాగనున్నట్టు తెలిపింది.

గతంలో 2016 నుంచి 2024 వరకు లక్ష్మయ్య బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయనకున్న లోతైన అవగాహన ఉన్నందున ఆయన అనుభవం ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి, టూరి జం అభివృద్ధిని దోహద పడుతుందని చేస్తోందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.