01-10-2025 02:15:35 AM
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కార్మికులు తమ ఆయుధాలు, పని ముట్లు ఆలయానికి తీసుకువెళ్లి పూజించడం ద్వారా విజ్ఞాలు, ప్రమాదాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుందని, అందుకే విజ యదశమి రోజున అనేకమంది కార్మికులు ఆయుధాలను, పనిముట్లను పూజిస్తారని, కార్మికుల శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ దసరా అని ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్‌ఏండబ్ల్యూఎస్ అండ్ ఎస్.బి ట్రేడ్ యూనియన్స్ జేఏసీ చైర్మన్ మొగుళ్ళ రాజిరెడ్డి అన్నారు.
దసరా పర్వదినం సందర్భంగా హెచ్‌ఏండబ్ల్యూఎస్ అండ్ ఎస్.బి ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నగరంలోని జలమండలి వివిధ సెక్షన్ల లో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమాలకు మొగుళ్ళ రాజిరెడ్డి తోపాటు టిజెఈ యు ప్రెసిడెంట్ సి.సతీష్ కుమార్‌లు అతిథులుగా పాల్గొని జలమండలి ఉద్యోగులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఆలీ, శ్రవణ్ కుమార్, ఎండీ జాంగిర్, రాఘవేంద్ర రాజ్, బి. దేవేందర్, ఇ. చంద్రశేఖర్, ఎం. రాజా, లక్ష్మణ్ యాదవ్, హాసిం, నరసింహారెడ్డి, బి.రాంచేందర్ తదితరులు పాల్గొన్నారు.