calender_icon.png 2 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా

02-10-2025 01:15:45 AM

  1. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ కర్ణన్

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దుర్గాష్టమి పూజలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 1 (విజయక్రాంతి): విజయ దశమిని పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ ఆర్‌వి కర్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయమే దసరా అని వారు చెప్పారు.

ఈ సందర్భంగా బుధవారం డిప్యూటీ మేయర్ శ్రీలత తన ఛాంబర్‌లో తన భర్త శోభన్‌రెడ్డితో కలిసి దుర్గాష్టమి పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సత్యనారాయణతో పాటు పేషీ సిబ్బంది పాల్గొన్నారు. పూజానంతరం వారు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.