02-10-2025 01:14:01 AM
డిసెంబర్ రెండో వారంలో పరీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 01 (విజయక్రాంతి): రాష్ట్రంలో అసిస్టెం ట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల అర్హతకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెం బర్ రెండో వారంలో పరీక్ష జరగనుంది. ఈనెల 10 నుంచి దర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయని, పరీక్ష సమయం మూడు గంటలుగా నిర్ణయించారు.