calender_icon.png 19 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ప్రతిభను వెలికి తీయడానికే డ్యూటీ మీట్స్

19-07-2025 12:00:00 AM

* అధికారులు, జాగిలాలను రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపిక    

* రాష్ట్ర స్థాయి మీట్ లో సత్తా చాటాలి :  ఎస్పీ  పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, జూలై 18(విజయక్రాంతి): పోలీసులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికే డ్యూటీ మీట్స్ నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జోనల్ డ్యూటీ మీట్ ను ప్రారంభించి మాట్లాడారు. గత నెలలో నర్వహించిన జిల్లా స్థాయి డ్యూటీ మీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక చేయడానికి, జోన్-VI లో కమిషనరేట్స్ మినహా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన 58 మంది అధికారులు, సిబ్బందికి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీంలకు జోనల్ లెవెల్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగిందన్నారు.

జోనల్ డ్యూటి మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 26న వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపిక చేయడం జరుగుతుందిని చెప్పారు. పోలీసుల పనితీరుకు అద్దంపట్టే ఇన్వెస్టిగేషన్ లో మెళకువలు ఈ డ్యూటి మీట్ ద్వారా మరింత మెరుగ్గా నేర్చుకోవచ్చన్నారు. సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసును డిటెక్ట్ చేసినట్లయితే ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  డ్యూటి మీట్ నోడల్ అధికారి, అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీసీఆర్బీ డియస్పి శ్రీనివాస్ రావు, ఎఆర్ డీయస్పి నరేందర్, వికారాబాద్ డ్యూటి మీట్ నోడల్ అధికారి, ఎఆర్ డీఎస్పీ వీరేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్స్ రమేష్, డ్యూటి మీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.