19-07-2025 02:19:22 AM
- ముగ్గురు అంతర్రాష్ట్ర పెడ్లర్ల అరెస్టు
- 28 మంది డ్రగ్స్ వినియోగదారులు పట్టివేత
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఈగల్ పోలీసులు కొరడా ఝుళిపించారు. రెండు వేర్వేరు దాడుల్లో ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేయడంతో పాటు, 28 మంది డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నారు. వారి నుంచి 3.25 కేజీ ల నల్లమందు (అఫీమ్), 2 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ బృందం బోయిన్‌పల్లి ప్రాంతం లో ముగ్గురు అంతర్రాష్ట్ర నల్లమందు పెడ్లర్లను అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన నిందితులు రాజస్థాన్‌లోని జలో ర్ జిల్లాకు చెందిన సవ్లారామ్ బిష్ణోయ్ (43), హాపూరామ్ బిష్ణోయ్ (38), లలారామ్ బిష్ణోయ్ (41)గా గుర్తించారు. వీరి నుంచి 3.25 కేజీల అఫీమ్ (విలువ సుమారు రూ.17 లక్షలు), రెం డు కార్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు.
సవ్లారామ్ బిష్ణోయ్ గత 10 సంవత్సరాలుగా తన సోదరుడు గంగారాంతో కలిసి హైదరాబాద్ లో నల్లమందు విక్రయిస్తున్నాడు. 2019లో గంగారామ్ 3.4 కేజీల అఫీమ్‌తో బోయిన్‌పల్లి పోలీసులకు పట్టు బడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిం ది. అఫీమ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం, లైంగిక శక్తి పెరుగుతాయంటూ అమాయకులను ఆకర్షించి, వారిని వ్యసనప రులుగా మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఒక్క కేజీకి సుమారు రూ.4 లక్షలు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. మరో ఘటన లో జూలై 12న గచ్చిబౌలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఈగల్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. గంజాయి కొనుగోలు చేయడా నికి వచ్చిన 14 మందిని పట్టుకుంది. శుక్రవారం వారిచ్చిన సమాచారం ఆధారంగా మరో 14 మంది వినియోగదారులను గుర్తించి పరీక్షలు నిర్వహిం చగా, వారంతా గంజాయి వాడినట్లు తేలింది.
పట్టుబడిన వారిలో ఆన్‌లైన్ వ్యాపారులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, డెంటల్ టెక్నీషియన్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, డ్రైవర్లు, ప్రైవేట్ ఈవెంట్ మేనేజ ర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే వ్యక్తి గచ్చిబౌలి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.