19-07-2025 02:17:12 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మహారాష్ర్ట ప్రభుత్వం 14 తెలంగాణ సరిహద్దు గ్రామాల ను తమ భూభాగంలో విలీనం చేసుకునే ప్రతిపాదనపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభు త్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాష్ డిమాండ్ చేశారు. ఈ గ్రామాలను విలీనం చేయాలనే మహారాష్ర్ట ప్రభుత్వ ఉద్దేశం తీవ్రమైన సమస్య అని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రె స్ ప్రభుత్వం రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతను కా పాడాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాం డ్ చేశారు.
తమ సరిహద్దులో ఉన్న 14 తెలంగాణ గ్రామాల విలీన ప్రక్రియను తమ ప్రభుత్వం వేగవంతం చేసిందని మహారాష్ర్ట రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావంకులే తెలిపారని సుభాష్ వెల్లడించారు. ఈ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు మహారాష్ర్ట వద్ద ఉన్నాయని, నివాసితులు మహారాష్ర్ట ఓటర్లేనని ఆయన అంటున్నారని పేర్కొన్నారు.
ఈ 14 గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని.. తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. మహారాష్ర్ట చేసిన వాదనలు ఎలా ఉన్నా, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం తెలంగాణ కనీస బాధ్యత అని తెలిపారు. వెంటనే సర్కారు ఈ విషయంపై దృష్టి సారించి తెలంగాణ పల్లెలను కాపాడుకోవాలన్నారు.