ముందస్తు బడిబాట ప్రారంభం
26-03-2026 12:04 AM
ఏంఈఓ సలీం షరీఫ్
కోదాడ, మార్చి 25 : కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాధికారి ఎండి .సలీం షరీఫ్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచడం కోసం ముందస్తుగా ‘బడిబాట‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపినారు.
పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలను తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరంగా తెలియజేస్తూ, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




