26 March, 2026 | 1:40 AM

వీవోఏపై అధికారులు చర్యలు తీసుకోవాలి

26-03-2026 12:02 AM

వేములపల్లి, మార్చి 25 : మండల పరిధిలో ని లక్ష్మీదేవిగూడెం వి ఓ ఏ ముత్యాల సరిత అవినీతి చేస్తుందని ఆమెపై అధికారులు చర్యలు తీసుకోవాలని సంఘం  సభ్యులు కోరారు. గ్రామంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు.  గత సంవత్సరం నవంబర్ నెలలో కలెక్టర్ గారికి ఆమె అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జనవరి 30వ తారీఖున సిసి, ఏపిఎం, బిపియంలు మా గ్రామానికి వచ్చి విచారణ జరిపారన్నారు.

ఈ విచారణలో విఓఏ తప్పు చేసిందని తేలగా సంఘం సభ్యులు అందరూ ఆమెను తొలగించాలని నిర్వహించిన సమావేశంలో చేతులెత్తామన్నారు. అదేవిధంగా తీర్మాణ పుస్తకంలో సంఘం సభ్యులు ఆమెను తొలగించాలని తీర్మానం చేసి సంతకాలు కూడా చేశామన్నారు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు వివోఏను తొలగిస్తామని హామీ ఇచ్చి వెళ్లినారన్నారు.

విచారణ అయిపోయిన మరుసటి రోజు నుండి ఆమెకు వ్యతిరేకంగా చేతులు లేపిన వారిపై వివోఏ  రాజకీయ అండదండలతో పాటు ఇన్చార్జి సిసి గోపి సహకారంతో సంఘం సభ్యురాలు అందరిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ పదేపదే హెచ్చరిస్తూ కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో ముత్యాల రవి పడిదెల లింగయ్య రైతులు ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి కాంటాలు వేయించుకొని బస్తాలు లెక్కపెట్టి దిగుమతికి పంపారన్నారు. ఈ దిగుమతి ట్రక్ సీట్లో బస్తాలు తక్కువ వచ్చాయని ఆ రైతులకు చెప్పడంతో బాధకు గురైన రైతులు వచ్చి వివోఏ ను అడగగా వారిపై అక్రమ కేసులను పెట్టి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నా యన్నారు. ఇప్పటికైనా వివో ఏ సరితపై అధికారులు చర్యలు తీసుకొవాళ్ళని కోరారు. ఈ సమావేశంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.