calender_icon.png 21 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కృష్ణవేణి పాఠశాలలో ముందస్తు బోనాల ఉత్సవాలు

19-07-2025 10:59:57 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(Sri Krishnaveni Talent School)లో శనివారం బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, ముందస్తుగా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు, అమ్మవారి వేషధారణలో పోతరాజుల విన్యాసాలతో పండుగ సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరిని ఆకట్టుకునేలా అలరించారు. విద్యార్థినీ, విద్యార్థులు, సంప్రదాయ దుస్తులతో అందరిని ఆకట్టుకునేలా బోనాల పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పి నాగరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.