calender_icon.png 21 July, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆస్పత్రిలో యువకుడు మృతి

19-07-2025 11:04:44 PM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన..

బాన్సువాడ (విజయక్రాంతి): ఓ యువకుడు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. మృతుని బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటకు చెందిన బాబు(27) అనే యువకుడు అస్వస్థతకు గురికాగా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి శుక్రవారం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతి చెందాడని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

మృతుడు నిజామాబాద్ లో ఒక హోటల్ లో పనిచేస్తున్నట్లు శుక్రవారం ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో సరైన చికిత్స చేయలేరని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.డాక్టర్లేమో మృతునికి వైద్యం చేశాం కానీ సీరియస్ కండిషన్ లొ రావడంతో మృతి చెందినట్లు డాక్టర్ శ్వేత తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను స్థానిక పోలీసులు సముదాయించి ఇంటికి పంపించారు. కొంతమంది డాక్టర్లు, సిబ్బంది రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులపట్ల నిర్లక్ష ధోరణి విడనాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.