calender_icon.png 15 August, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

15-08-2025 12:54:18 AM

కరీంనగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : నగరం లోని పారమిత విద్యాసంస్థలల్లో  శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.జన్మాష్టమి సందర్భంగా జరిగిన ఉట్టి పోటీల్లో చిన్నారి కృష్ణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టారు.

ఈ సందర్భంగా పారమిత పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాద్‌రావు మాట్లాడుతూ  ఈ జన్మాష్టమి నుండి మీ ఒత్తిళ్లు మరియు చింతలన్ని తొలగి మీకు ప్రేమ, శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించాలని, గీతను అనుసరించి ఫలితాన్ని ఆశించకుండా ఏకాగ్రతతో  ఇష్టపడి పని చేయాలని నేటి యువత దీనిని  దైనందిన జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగాలని  శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనూకర్‌రావు, ప్రసూన, రశ్మిత,రాకేశ్, వి.యు.ఎం. ప్రసాద్, టి.యస్.వి. రమణ, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవితా ప్రసాద్, గోపీకృష్ణ,ఎం. శ్రీకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.