25-08-2024 12:30:00 AM
తేదీలు ప్రకటించిన ఆర్బీఐ
కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో రిజర్వ్‌బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్‌జీ బీలు) జారీచేస్తుంది. ఎస్‌జీబీల్లో పెట్టుబడి చేసినవారికి బంగారం ధర పెరుగుదలతో లభించే ప్రయోజనంతో పాటు ఆయా సిరీస్ బాండ్లకు అనుగుణంగా 2.5 శాతం లేదా 2.75 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. వీటి కాలపరిమితి 8 ఏండ్లుకాగా, వాటిని ఐదేండ్ల తర్వాత ముందస్తుగా నగదు చేసుకోవడానికి సైతం అవకాశం ఉంది. ఈ అవకాశం త్వర లో కొన్ని ఎస్‌జీబీలకు లభించనుంది.
2017 మే నుంచి 2020 మే వరకూ జారీఅయిన సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్నింటికి ముం దస్తు రిడంప్షన్ తేదీలను తాజాగా ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బాండ్లు కలిగినవారు ఆర్బీఐ ప్రకటించిన తేదీల్లో ముందస్తు రిడంప్షన్ కోరుతూ దరఖాస్తు సమర్పిస్తే, అప్పటి బంగారం ధరకు అనుగుణంగా నగదును వడ్డీతో సహా బ్యాంక్ ఖా తాల్లో జమచేస్తారు. ఈ బాండ్లు 30 విడతలుగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 మా ర్చి వరకూ వస్తాయి. ఈ ఏడాది ముందస్తు రిడంప్షన్‌కు వచ్చే ఎస్‌జీబీల జాబితా ఇది..