25-08-2024 12:30:00 AM
అధిక వడ్డీ రేటు లభించే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని సాధారణంగా మదుపుదారులు ఆశిస్తుంటారు. పలు పెద్ద బ్యాంక్‌లు కొద్దివారాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. సాధారణంగా బ్యాంక్‌తో కస్టమర్లకు దీర్ఘకాలిక అనుబంధం ఉంటుంది. ఇదే సమయంలో కాస్త ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్‌ను సైతం ఎంచుకోవడం సహజం. అలాగే ఎఫ్‌డీ కాలపరిమితి తక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటు, దీర్ఘకాలిక ఎఫ్‌డీ అయితే అధిక వడ్డీ రేటు లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడాది ఎఫ్‌డీపై ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌లను చూద్దామా!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఏడాది కాలపరిమితిగల డిపాజిట్‌పై 6.8 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లను 7.30 శాతం ఆఫర్ చేస్తున్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 6.60 శాతం, సీనియర్లకు 7.10 శాతం వడ్డీని ఇస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఏడాది డిపాజిట్‌పై జనరల్ సిటిజన్లకు 6.7 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు ఈ డిపాజిట్లకు 7.10 శాతం, 7.60 శాతం చొప్పున ఉన్నాయి. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం ఇస్తున్నది.
ఏడాది ఎఫ్‌డీపై వివిధ బ్యాంక్‌ల వడ్డీ రేట్లు
ఐదేండ్ల ఫిక్స్‌డ్‌పై వడ్డీ రేట్లు ఇలా...
అధిక వడ్డీ రేటు లభించే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సాధారణంగా మదుపుదారులు ఆశిస్తుంటారు. బ్యాంక్‌లో డిపాజిట్లకు ఆయా కాలపరిమితులకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఉంటాయి. పరిమితి పెరిగే కొద్దీ వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఆరు నెలల వరకూ స్వల్పకాలిక డిపాజిట్ అయితే బ్యాంక్‌లు 3 నుంచి 4.5 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. అదే ఒక ఏడాది లేదా అంతకుపైబడితే 6 శాతం వడ్డీ ఉంటుంది. ఇలా డిపాజిట్ కాలపరిమితి పెరిగితే, వడ్డీ రేటు సైతం అధికమవుతూ ఉంటుంది. ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ప్రధాన బ్యాంక్‌లు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం. ఈ రేట్లు జూన్15 నుంచి అమలులోకి వచ్చాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.2 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై 6.7శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు జూన్14 నుంచి అమలులోకి వచ్చాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై అరశాతం అదనంగా లభిస్తుంది. వీరికి ఇచ్చే వడ్డీ 7 శాతం. ఈ రేట్లు జూన్10 నుంచి అమలులోకి వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటును ఆఫ ర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై అరశాతం అదనంగా లభిస్తుంది. వీరికి ఇచ్చే వడ్డీ 7.5 శాతం. ఈ రేట్లు జూన్12 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్లు జూన్12నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్లు జూన్12నుంచి అమలులోకి వచ్చాయి.