calender_icon.png 4 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సేవలకు ఈసీఐనెట్ యాప్

03-11-2025 03:05:24 AM

  40కి పైగా యాప్‌లను ఏకీకృతం చేసిన ఈసీ

ఓటరు నమోదు నుంచి ఫలితాల వరకు సమస్త సమాచారం ఒకే గొడుగు కింద

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): ఎన్నికల ప్రక్రియలో మరో డిజిటల్ విప్లవానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు నమోదు, అభ్యర్థుల వివరాలు, ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి.. ఇలా ఎన్నికలకు సంబంధించిన సమస్త సేవలను, సమాచారాన్ని పౌరులకు ఒకేచోట అందుబాటులోకి తెస్తూ ఈసీఐనెట్ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఇకపై పౌరులు, రాజకీయ పార్టీలు, అధికారులు వేర్వేరు యాప్‌లను, వెబ్‌సైట్లను వెతుక్కునే శ్రమకు ఈసీఐ శాశ్వతంగా తెరదించింది.

ఎన్నికల సంఘం ఇప్పటివరకు వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్న 40కి పైగా వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను ఏకీకృతం చేసి ‘ఈసీఐనెట్’ యాప్‌ను  రూపొందించింది. ఈ విశిష్టత కారణంగా దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్‘గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒక్క యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఎన్నికలకు సం బంధించిన అన్ని సేవలు అరచేతిలోనే లభిస్తాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారం భమైన ఈ అప్లికేషన్ సేవలు, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.