03-11-2025 03:05:45 AM
ముకరంపుర, నవంబరు 2 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఓవెల్స్ పాఠశాలలో ఆదివారం తైక్వాండో కలర్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షను నిర్వహించారు. సుమారు 50 మంది బాల,బాలికలు పాల్గొని ప్రతిభను కనబరిచి బెల్ట్ లను కైవసం చేసుకున్నా రు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తై క్వాండో అసోసియేషన్ కోశాధికారి గందె సంతోష్, పాఠశాల హెడ్ మాష్టర్ తిరుపతిరెడ్డి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్.సంతోష్, పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ ఎన్.సతీష్ కుమార్, సిరిసిల్ల కోచ్ శ్రీనివాస్ అలాగే కోచ్ లు, రమేష్ , క రుణాకర్, ఇన్స్ట్రక్టర్ శ్రీనిధి, పార్ధు, విహన్ రావ్, శ్రీకృతి, కోచ్ పెండ్లి రాజేందర్ తదితరులుపాల్గొన్నారు.