కేబీఆర్ పార్క్ తరహాలో బీఎన్ రెడ్డినగర్‌లో ఎకో పార్కు
- బీఎన్ రెడ్డి నగర్‌లో 116 ఎకరాల్లో పార్కు అభివృద్ధి
- 18న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఏర్పాట్లను పరిశీలించిన సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్,
- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, జూన్ 15 : కేబీఆర్ పార్కుకు ధీటుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో అద్భుతమైన పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ ను ఆనుకొని ఉన్న ఫారెస్టులో ఎకో టూరిజం పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18న వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి సోమవారం చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్ వో రోహిత్ రెడ్డి, ఏసీపీ కాశీ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ..
ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు 116 ఎకరాల్లో పార్కును అందుబాటులోకి రావడం అదృష్టమన్నారు. 30 ఏళ్లుగా ఉన్న స్థల వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పార్కును అభివృద్ధి చేయడమే కాకుండా రూ. 20 కోట్లతో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలకు వరద, డ్రైనేజీ నీటి సమస్య పరిష్కారానికి బాక్స్ డ్రైన్, డ్రైనేజీ లైన్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు.
గత ప్రభుత్వం హైదరాబాద్ నిధులన్నీ కాళేశ్వరాన్ని తరలించిందని విమర్శించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడి నిధులను నగర ప్రజలకే ఖర్చు పెడుతూ అభివృద్ధిని, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు జరిగే సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, నాయకులు పార్వతి గణేశ్ రెడ్డి, రఘుమారెడ్డి, భీమిలి రామకృష్ణారెడ్డి, కళ్లెం సుజాతా రెడ్డి, రజిని రావు, రాజేశ్వరి, వసంత, భాను, వినయ్ పటేల్, చంద్రకాంత్ గౌడ్, దాము మహేందర్ యాదవ్, శ్రీనాథ్, ప్రవీణ్ రెడ్డి, సూర్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి, రేణు గౌడ్, అంతటి శ్రీనివాస్ గౌడ్, మనీష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, భవాని తదితరులు పాల్గొన్నారు.






