మత్తు పదార్థాలను నివారిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం..
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూన్ 15 (విజయక్రాంతి): మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చ ర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కు మార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కా ర్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీ సీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మత్తు పదార్థాల నియంత్రణపై ఎక్సైజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీ, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల వద్ద వంద మీటర్ల లోపు పాన్ షాప్ లు,ఎలాంటి గుట్కా లాంటి అ మ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖల అ ధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహంచి, మత్తు పదార్థాలు, పొగాకు విక్రయాలను నిరోధించాలన్నారు.
యువత మాదక ద్రవ్యా ల బారిన పడకుండా సిఓటిపిఏ యాక్ట్ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగ బాధితుల వల్ల సమాజానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణకు అవగాహన కా ర్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ ఎస్పీ అనిత, డీఎంహెచ్‌ఓ మల్లిఖార్జున రావు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.






