27-01-2026 12:35:43 AM
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ విధానం
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా సోమవారం గాంధీభవన్‌లో మహేష్‌కుమార్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగా లు, కృషి ఫలితంగా నేడు దేశంలో ప్రజలు స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పెద్ద లు 2014 నుంచి అధికారం చేస్తున్నారని, ఇప్పుడు వాళ్లు రాజ్యాంగాన్ని మార్చే ప్రయ త్నం చేస్తున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. రాజ్యాంగం మార్చడం, గాంధీ, నెహ్రూల కుటుంబాలను ప్రజల నుంచి దూ రం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని దుయ్యబట్టారు.
ఉపాధి చట్టంలో మహాత్మా గాంధీ పేరు తొలగించారన్నారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షే మ పథకాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొ క్కుతున్నారని, లౌకిక వాదానికి తూట్లు పొడిచే కుట్రలు చేస్తూ.. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ కానుకను కాంగ్రె స్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభు త్వం కషి చేస్తోందని, ఏఐసీసీ నాయకులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో ముందుకు పోతున్నామన్నారు. కుల సర్వే తో యావత్ రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కుల గణన బిల్లులను అడ్డుకుంటున్న బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మంత్రి అజారు ద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మె ల్యే దానం నాగేందర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, చిన్నారెడ్డి, బెల్లయ్యనాయక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.