27-01-2026 12:47:28 AM
బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్ర
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
ముషీరాబాద్, జనవరి 26 (విజయక్రాం తి): ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 56% టికె ట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణలతో కలిసి జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీసీల ఓట్ల కోసం అధికారంలోకి రాకముందు కాశ్మీర్ నుండి కన్యాకు మారి వరకు జరిగిన భారత్ జూడో యాత్రలో రాహుల్‌గాంధీ దేశంలో కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఎవరి వాటా వారికి దక్కాలని ఊరూరా ప్రచారం చేశాడని, గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలోను రాహు ల్ గాంధీ ఇదే విషయం పదేపదే చెప్పి బీసీల ఓట్లు వేయించుకున్నారని,
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరించి బీసీలకు అన్యాయం చేస్తూ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అలాగే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం కోసం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వి డుదల చేయడం చాలా అన్యాయం అన్నారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వడం వీలుకాకపోతే పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయిస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరా ఎన్నికలు సమ యం జరుగుతున్న సందర్భంలో ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ మున్సిపల్ ఎన్నికలపై బీసీ సమాజానికి స్పష్టత నివ్వాలని, రిజ ర్వేషన్ల పరంగా ఇవ్వడం కుదరకపోతే తాము హామీ ఇచ్చినట్టుగా పార్టీ పరంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు 68 మున్సిపల్ చైర్మన్లు 1150 కౌన్సిలర్లు కార్పొరేటర్ పదవు లు ఇవ్వాలని లేనిపక్షంలో భవిష్యత్తులో కాం గ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చెవి చూడవలసి వస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరీ శేఖర్ సగర అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘo కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, బీసీ జేఏసీ కన్వీనర్ కవుల జగన్నాథం, బీసీ కల్చరల్ పో రం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బీసీ జేఏసీ కన్వీనర్లు నరసింహ, శివకుమార్, భాస్కర్, రాజేందర్, సత్యరాజ్ గౌడ్ పాల్గొన్నారు.