calender_icon.png 27 January, 2026 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది

27-01-2026 12:00:00 AM

  1. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి 

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఘనంగా గణతంత్ర వేడుకలు

కరీంనగర్/పేద్దపల్లి/జగిత్యాల/రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (విజయ క్రాంతి): ప్ర పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మ నదని, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారధ్యంలో రచించిన రాజ్యాంగం 25 జనవరి 1950న అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవా రం 77వ భారత గణతంత్ర దినోత్సవం సం దర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహిం చిన వేడుకల్లో ఆమె పాల్గొని పతాకావిష్కరణ చేశారు.

అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రా జ్యాంగం లో పొందుపర్చిన సూత్రాలకు, రా జ్యాంగ ఆదర్శాల సహకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యమని అన్నారు. రా జ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాల్లో దేశం వివిధ రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధించిందని అన్నారు. జిల్లాను అన్ని రం గాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

సీఎం ఎనుముల రేవం త్ రెడ్డి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతోపా టు ఐటీ నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయ అభివృద్ధిని సాధి స్తూ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. మహాలక్ష్మీ పథ కం ద్వారా 239 బస్సులలో 6 కోట్ల 33 లక్ష ల మంది ప్రయాణీకులు 278 కోట్ల రూపాయల లబ్ది పొందారని అన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 1,71,622 సర్వీసులకుగాను 5 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.

1,56,083 మంది లబ్దిదా రులకు 5,32,066 సిలిండర్లకు 500 రూపాయలకే అందించామని, ఇందుకు 16 కోట్ల 44 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. జిల్లాలో 79,541 మంది రైతులకు 622 కోట్ల రుణమాఫీ చేశామని, 1,90,186 మంది రైతులకు వానాకాలం సీజన్లో 206 కోట్ల 62 లక్షల 96 వేల రూపాయలను ఖాతాల్లో జమ చేశామన్నారు.

ఈ యాసంగి కోసం 41,897 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే సరఫరా చేశామన్నా రు. రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8 కోట్ల 80 లక్షల బీమా సొమ్మును అందజేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా 11,575 మందికి ఇండ్లను కేటాయించామని, వివిధ దశల్లో ఉన్న 6059 గృహాలకు 128 కోట్ల 88 లక్షల రూపాయలు లబ్దిదారులకు చెల్లించామన్నారు. 

- పెద్దపల్లి జిల్లాలో...

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ కో య శ్రీ హర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పాల్గొని పోలీసు గౌరవం వందనం స్వీకరించి జాతీ య జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ  అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం నూతనంగా 24 వేల 603 రేషన్ కా ర్డులు జారీ చేయడం ద్వారా అదనంగా 86,734 మంది పేదలు రేషన్ ద్వారా సన్న బియ్యం పోందుతున్నారని అన్నారు.

ఖరీఫ్ 2024-25 సీజన్ కు సిఎంఆర్ రైస్ డెలీవరి 100  శాతం పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా  రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీక రణ పథకాన్ని పునః ప్రారంభించి, జిల్లాలో  61 మంది రైతులను ఎంపిక చేసి 23 లక్షల 36 వేల రూపాయల సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామని తెలిపారు.   

ఈ కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డి, అదనపు కలెక్టర్ లు జే అరుణ శ్రీ, డి వేణు,  పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీ స్ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- జగిత్యాల జిల్లాలో...

జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, రాష్ట్ర శోభ సంతరించుకుని నిర్వహించబడ్డా యి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పంట ల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కె ట్ యార్డుల్లో ఎం ఎస్ పి చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో జిల్లాలో పీహెచ్సీ, సిహెచ్సి, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు.

విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుప డినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏవో షాదబ్ హకిమ్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సం బంధిత అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో...

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. అక్కడి నుంచి నేరుగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు.

విద్యార్థుల నృత్యా ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్ శాఖ, చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షే మ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్‌ఎఫ్, వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో తమ తమ శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కలిసి పరిశీలించారు. 

అనంతరం లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, డీ ఎస్ పీ నాగేంద్రచారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.