12-09-2025 12:07:57 AM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి)సమాజంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులు అత్యంత కీలకమని చిన్న సన్నకారు రైతులతో పాటు నిరుద్యోగ యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచిస్తున్న విధంగా రుణాలు మంజూరు చేయా లని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షే మ పథకాల కింద రుణాలు సమయానికి అందించడం, రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల వారికి ప్రాధా న్యత కల్పించి త్వరితగతిన రుణాలు మంజూ రు చేయాలని సూచించారు.
అత్యవసర రుణ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని, బ్యాంకులు, అధికారుల మధ్య సమన్వయం పెంచాలని, పథకాల అమలులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, ఆయా బ్యాంక్ మేనేజర్లు తదితరులుపాల్గొన్నారు.