12-09-2025 12:07:33 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
తాడ్వాయి, సెప్టెంబరు11 (విజయక్రాంతి): మేడారం జాతరకు సంబంధించిన పనులు భక్తులు సంతృప్తిగా అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయుటకు,అన్ని శాఖల అధికారులు జయింట్ ఇన్స్పెక్షన్ చేసి వారంలోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
అన్నారు గురువారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం ఐటిడిఎ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పి శబరిష్,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా,డిఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్,అదనపు కలెక్టర్లు సి. హెచ్. మహేందర్ జి, సంపత్ రావులతో కలసి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఆర్,ఆర్ అండ్ బి,ట్రైబల్ వెల్ఫేర్,ఆర్ డబ్లూ ఎస్, రెవిన్యూ, ఫారెస్ట్, పోలీస్, విద్యుత్, శాఖల అధికారులు జయింట్ ఇన్స్పెక్షన్ చేసి వారంలోగా నివేదిక సమర్పించాలని సూచించారు.
ప్రతి శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయేట్లు, పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించెట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో జరిగిన మహా మేడారం జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. మేడారం సంబంధ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారం లో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అన్నారు.
విధులు కేటాయించబడిన ఎఇ, డిఇలు మేడారంలోనే ఉండి, పనులు చేపట్టాలని,ఈఈలు ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం క్షేత్ర సందర్శన చేసి, పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. మేడారం జాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు రానున్నట్లు అంచనా ఉన్నట్లు, వన దేవతల పండుగ, వనంలో పండుగ, చుట్టూతా వనం, ప్రక్కనే వన్య ప్రాణులు కాబట్టి, వనాన్ని, వనంలోని ప్రాణులను కాపాడుకొనే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.