calender_icon.png 15 August, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనకు మోదీ

14-08-2025 12:00:00 AM

  1. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరు

ట్రంప్, జెలెన్‌స్కీతో భేటీకి అవకాశం

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రతీకార సుంకాల తో భారత్‌ను బెంబేలెత్తిస్తున్న అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ప్ర ధాని అమెరికాకు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన సందర్భం గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర విదేశీ నేతలతో కూడా ప్రధాని సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో యూఎన్‌జీఏ సమావేశం ఉండనుంది. జీ7 సదస్సు సందర్భంగా జూన్‌లోనే అమెరికా అధ్యక్షు డు నరేంద్ర మోదీ వాషింగ్టన్‌కు ఆహ్వానించారు. ఆ సమయంలో మోదీ వాషింగ్టన్‌కు వెళ్లలేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆ సమయంలో ట్రంప్‌తో విందులో పాల్గొన్నారు. న్యూయార్క్ వేదికగా జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశానికి ప్రపంచంలోని అనేక మంది నాయకులు హాజరుకానున్నారు.