calender_icon.png 19 November, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆల్ ఫలాహ్’ హెడ్డాఫీసుపై ఈడీ దాడులు

19-11-2025 12:09:33 AM

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ కేసుతో సంబంధం ఉన్న ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంపై మంగళవారం మెరుపు దాడులు చేసింది. అలాగే వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దిఖీ నివాసంతోపాటు ట్రస్టీల నివాసాలు సహా ఢిల్లీ, ఫరీదా బాద్ వంటి 25 చోట్ల సోదాలు నిర్వహించింది. పేలుడుకు మందు వర్సిటీ ఆర్థిక వ్యవ హారాల్లో ఏమైనా అక్రమాలు జరిగాయనే అనుమానంతో కొన్ని గంటలపాటు తనిఖీలు చేపట్టింది.

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్ప డిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీతోపాటు జైష్- ఏ మహమ్మద్‌కు సంబంధించిన ‘టెర్రర్ మా డ్యూల్’లో భాగస్వాములుగా చిక్కిన వారం తా ఈ వర్సిటీలోనే పనిచస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. దీంతో వర్సిటీ ప్ర ధాన ఆఫీసులో కీలక డాక్యుమెంట్లను, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నది. వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దిఖీని విచారించింది.