calender_icon.png 12 December, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు ప్రథమ ప్రాధాన్యం

10-12-2025 01:21:11 AM

  1. విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక
  2. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం లేకుండా అభివృద్ధి అసాధ్యం
  3. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదారాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ శాఖలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల విజన్ 2047లో మంచి విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకు పోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ -2047లో సంక్షేమ శాఖలపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విజన్ 2047లో 80 శాతానికి పైగా ఉన్న జనాభా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యమని భావిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంచి నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, రిజర్వేషన్స్ అమలు, ఉన్నత విద్య, విదేశీ విద్య లకు భవిష్యత్తులో అన్ని రకాల ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మేధావుల సలహాలు సూచనలు స్వీకరించి వాటిని కార్యాచరణ తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమలు ఐటీ, ఫార్మా టూరిజంలలో ఇన్ క్లూజివ్ గ్రోత్ కనబడేలా సంక్షేమ శాఖలకు ప్రాథమిక కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టు గతంలో పేదలకు భూములు పంచి పెట్టేవారు.. కానీ ఇప్పుడు పేదలకు ప్రభు త్వం ఇవ్వగలిగేది నాణ్యమైన విద్య మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని, రేపటి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలంటే ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ కర్తవ్యం