14-08-2025 01:38:35 AM
- వారిని ప్రజలు తరిమి వేయకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ సవాల్
- రెండేళ్లవుతున్నా ఒక్క హామినీ కాంగ్రెస్ అమలు చేయలె
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఏదైనా గ్రామానికెళ్లి ఆరు గ్యారెంటీలన్నీ అమ లు చేశామని దమ్ముంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెం టీలలో దాదాపు అన్ని అమలు చేశామన్న డి ప్యూటీ సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఓ ప్రకటన వి డుదల చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్క హామీని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అన్నీ చేశామంటూ చెప్పడం ప్రజల ను మోసగించడమేనని మండిపడ్డారు. ఆరు గ్యారంటీ లు, 420 హామీల అమలుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని చూసి ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్కతో పాటు ఏ మంత్రయినా రాష్ర్టంలోని ఏ గ్రామానికైనా వెళ్లి అన్ని హామీలు అమలు చే శామని ద మ్ముంటే ప్రజల ముం దు చెప్పాలని.. చెప్పిన తర్వాత ప్రజలు వా రిని తరిమి వేయకపో తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీ లు అమలు చేశామని చెబుతున్న అబద్ధాలకు ప్రతి గ్రామం లో ప్రజలే సమాధానం చెప్తారని ధ్వజమెత్తారు.
వర్ష బాధితులకు అండగా ఉండాలి
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోత ట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు బాధితులకు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అండగా నిలవాలన్నారు.
కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్ట లు వంటి కనీస అవసరమైన స హాయాన్ని అందించాలన్నారు. అత్యవసర వైద్యం కోసం అవసరమైన చోట మెడికల్ క్యాం పులను ఏర్పాటు చేసేందుకు చ ర్యలు తీసుకోవాలని సూచించా రు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ శాఖ హెచ్చ రికల మేరకు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేవంత్‌రెడ్డికి రాజకీయాలే ప్రాధాన్యత
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల సేవ కంటే రాజకీయాలు, ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్వాల్‌గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యమవుతు న్నాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయంలోనే మెజార్టీ భాగం పనులను పూర్తయినా, ఈరోజు వరకు పార్క్ ప్రారంభం కాని దుస్థితి నెలకొందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ స్థాయి పార్క్.. ప్రస్తు త ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అసమర్థత, నిర్లక్ష్యం ప్రధా న లక్షణాలుగా మారాయని, ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి పనులు పక్కనపెట్టి ప్రచార యాత్రలకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని మండిపడ్డారు.