30-10-2025 01:18:17 AM
మంచిర్యాల, అక్టోబర్ 29 (విజయక్రాం తి): అమృత్ 2.0 పథకం కింద జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, అవసరమైన వివరా లను సంబంధిత శాఖల అధికారులు అం దించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో డీటీసీపీ జేడీ, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని, మంచిర్యాల డీటీసీపీఓ సంపత్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 సంవత్సరాల వరకు భవిష్యత్తు అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు. డిజిటల్ మ్యాపింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వినియోగ మ్యాప్లు రూపొందించాలని, నూతన డేటాను ప్రతిబింబించేలా జిఐఎస్ ఆధారిత ప్లాన్లను రూపొందించి అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.
సమగ్ర ప్రణాళికతో భవిష్యత్తు అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. 2051 నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, తరగతుల వారీగా జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇండ్లు, తాగునీరు, రహదారులు, ఇతర ప్రజాసేవలు ప్రణాళికాబద్ధంగా అందించేందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు.
సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 37.67 కిలో మీటర్ల ఏరియాలో, మం దమర్రి మున్సిపల్ పరిధిలో 38.98 కిలో మీటర్ల ఏరియాలో డ్రోన్, సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. త్వరలోనే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయి సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యకలాపాల సమయంలో అవసరమైన మద్దతును అందిం చాలని, సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కార్యక్రమ నిర్వహణ కొరకు టిపిబివోలు, వార్డు ఆఫీసర్ లను సహాయకులుగా నియమించి బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
కేజీబీవీని సందర్శించిన కలెక్టర్
మందమర్రి, అక్టోబర్ 29 : మండల కేం ద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం డిప్యూటీ తహసిల్దార్ సంతోష్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మె నూ ప్రకారం ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ఎస్‌ఓ సునీత, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.