19-08-2025 12:00:00 AM
రామప్ప, లక్నవరాన్ని డెవలప్ చేస్తా
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ములుగు, ఆగస్టు 18 (విజయక్రాంతి) ః ములుగు జిల్లాలో రామప్ప,లక్నవరంను అభివృద్ది చేస్తూ,రాష్ర్టంలోనే ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని రాష్ర్ట పంచాయితీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామములో 37కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ ను రాష్ర్ట పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హె మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
క్రష్ కేంద్రంలో పిల్లల సంరక్షణ..
మంత్రి సీతక్క
ములుగు, ఆగస్టు18 (విజయక్రాంతి) : క్రష్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు,పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలని రాష్ర్ట పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో మంత్రి సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హె మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి మరియు డే కేర్ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అంచనా 15లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సరైన క్రష్ కేంద్రాలు లేకపోవడంతో తరచుగా మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా మారిపోయిందని తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు.
7నెలల నుండి 3సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రేష్ సౌకర్యాలను అందించబడుతాయని పోషకాహార%ళి% పిల్లల ఆరోగ్యం,పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రె కేంద్రాలు అందిస్తాయని తెలిపారు.
ములుగు జిల్లాలో ములుగు, తాడ్వాయి,ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలో పల్నా పథకం ద్వారా 25డే-కేర్/క్రె కేంద్రాలు ఏర్పాటు చేస్తామని,తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని సూచించారు.