23-09-2025 01:41:14 AM
అధికారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి
మేడ్చల్, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం లో రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులకు విన్నవించారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ, హైదరాబాద్, సికింద్రాబాద్ డిఆర్‌ఎమ్ లు సంతోష్ కుమార్ వర్మ, గోపాల కృష్ణన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వాజ్పేయి నగర్ ఆర్ యు బి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, జనప్రియ అపార్ట్మెంట్స్ వద్ద ఆర్ యు బి అభివృద్ధి చేయాలని, బొల్లారం రైల్వే బజార్ కొత్తబస్తి బజార్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే భూదేవి నగర్, మౌలాలి శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారు.
ఆర్కే పురం ఫ్లై ఓవర్ నిర్మాణానికి డ్రాయింగ్స్ ఆమోదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంట కార్పోరేటర్ శాంతి శ్రీనివాస రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, జీకే హనుమంతరావు, అమీనుద్దీన్, మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, భాగ్యానందరావు, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్ తదితరులు ఉన్నారు.