calender_icon.png 5 May, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి కృషి

05-05-2025 01:50:40 AM

పటాన్ చెరు, మే 4 :సమాజంలో కుల సంఘాల పాత్ర గణనీయంగా పెరిగిందని, నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి పక్షపాతం లేకుండా సంపూర్ణ సహకా రం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పటాన్  చెరు పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సఫాన్దేవ్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఆదర్శ్ రెడ్డి, నర్ర భిక్షపతి, మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు భోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్, ముఖ్య సలహాదారుడు నర్రా భిక్షపతి, గౌరవ అధ్యక్షుడు బుచ్చయ్య, ఉపాధ్యక్షులు నర్ర రామారావు, కాసాల యాదయ్య, నాయకులు బంటి, సుధాకర్, సంఘం సభ్యులుపాల్గొన్నారు.