05-05-2025 01:52:07 AM
నారాయణఖేడ్, మే 4: జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మ జాతర మహోత్సవం సందర్భంగా నారాయణ ఖేడ్ నుండి బోరంచ మీదుగా కంకోల్ వరకు ప్రత్యేక బస్సులు ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ నుండి బోరంచ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. అనంతరం స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు గత మూడు నెలలు 18 నూతన ఆర్టీసీ బస్సులను తీసుకురావడం జరిగిందన్నారు. జూన్ వరకు మరో 10 కొత్త బస్సులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించాలని అన్నారు.
ఈ సందర్భంగా బస్సులో పలువురు మహిళ ప్రయాణికులతో మాట్లాడారు. జాతర ఉత్సవాలకు హాజరైన భక్తులకు బస్సు సౌకర్యం ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన వెంట నారాయణఖేడ్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సెట్, హనుమాన్లు భూమయ్య అఖిలేష్ రెడ్డి, సంజీవరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం, మార్కెటింగ్ అధికారి పాండు తదితరులుఉన్నారు.