calender_icon.png 10 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

08-01-2026 12:00:00 AM

కోదాడ, జనవరి 7: కోదాడ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులను వివిధ శాఖల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు  అధికారులకు సహకరించాలని కోరారు. తహశీల్దార్ వాజిద్ అలీ, ఎంపీఓ రాంబాబు, ఏఈ రాము, ఏఓ రజిని, ఐసీడీఎస్ రమణ, ఏఈ డబ్ల్యూ ఎస్ రవి, ఇరిగేషన్ గోపి, ఏపిఓ ఠానియా, ఏపీఎం వెంకటయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.