calender_icon.png 9 January, 2026 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా

08-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు, జనవరి7, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ప్రముఖ శ్రీ బావిగీ భద్రేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని దేవాలయ ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్,

కేదార్నాథ్ దేవాలయ ప్రధాన అర్చకులు శివలింగ స్వామి తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, పాలకవర్గం సభ్యులు కోటం సిద్ద  లింగం, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, కిరణ్ కుమార్, వీర శైవ సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్  తదితరుల తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని..

అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా..ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన దుకాణ సముదాయాన్ని నిర్మించామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన దాసోహం కూడా నిర్మించడం జరిగింది. రానున్న రోజుల్లో వేద పాఠశాలతో పాటు భక్తులకు మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరశైవ యువ దళ్, మరియు మహిళా విభాగం సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు.