calender_icon.png 16 July, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల అభివృద్ధికి కృషి చేయాలి

16-07-2025 12:11:40 AM

ఇబ్రహీంపట్నం, జూలై 15: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో భువనగిరి మంగళవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి పరిధిలోని పలు రోడ్ల అభివృద్ధి చేయాలని మంత్రి కోమటి రెడ్డిని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని సింగిల్ రోడ్ నుండి డబుల్ రోడ్, డబుల్ రోడ్ నుండి ఫోర్ లేన్ రోడ్లుగా విస్తరణ చేపట్టాలని వారు మంత్రిని కోరారు. సుమారు 383 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. అనంతరం మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి సంబంధిత పనులు మంజూరుకు చర్యలు చేపడతామని మంత్రితెలిపారు.