16-07-2025 12:11:17 AM
ఎంఈఓ డి పుల్లయ్య
ఖమ్మం, జులై 15 (విజయ క్రాంతి):బోనకల్ మండలం లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండుటకు గాను వంట సామాగ్రి సిద్ధం గా వుందని బోనకల్ ఎం ఈ ఓ డి పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
30 పాఠశాలలకు 602 పాత్రలు, 30,15,10 కేజీల గిన్నెలు స్టీల్ బేసిన్లు,స్టీల్ కంటైనర్లు,హస్తాలు,సాంబార్ డోంగా,కూర గంటే మంచినీటి జగ్గులు కురిపిలు మొదలుగునవి పంపిణీ కి సిద్దంగా ఉన్నవని తెలిపారు. సంబధిత ప్రధానోపాధ్యాయులు మండల విద్య వనరుల కేంద్రం నుండి తీసుకువెళ్లగలరనిఅయనకోరారు.