calender_icon.png 16 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిథమ్ డైరక్టర్‌గా ప్రొ.వెంకటరమణ నియామకం

16-07-2025 12:12:39 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్సిటాలిటి మేనేజ్‌మెంట్ (నిథమ్) డైరక్టర్‌గా ప్రొ. వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చర్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రొ. వెంకటరమణ మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావును  ప్రొ. వెంకటరమణమంగళవారం మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందిం చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణకు మంత్రి శు భాకాంక్షలు, అభినందనలు తెలిపారు.