22-01-2026 12:54:38 AM
నల్లగొండ టౌన్, జనవరి 21: డిగ్రీ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు మరింత కృషి చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు బుధవారం యూనివర్సిటీలో పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల 75% హాజరు శాతం విధిగా పాటిస్తూ ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని అన్నారు.
ఉన్నత విద్యా మండలి సూచనల మేర నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని అందుకు హాజరు, బోధన పై దృష్టి సారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యఫలిత కేంద్రిత విద్యా నమూనా పై సర్వత్ర చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు బాధ్యతగా సంస్కరణలు అవసరమని అన్నారు. డిగ్రీ పట్టాలతో పాటు నైపుణ్యం ఉంటేనే ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ఈ సమావేశం లో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా ఎం జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.