calender_icon.png 22 January, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : సీఐ శివశంకర్

22-01-2026 12:54:42 AM

నారాయణపేట.జనవరి,21 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మే రకు,తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరి యల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భ ద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అదే విధంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలపై ప్రెస్ మీట్ నిర్వహించామని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోడ్డు భద్రత నియమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు అతికించి అవగాహన కల్పించామని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా నా రాయణపేట సీఐ శివశంకర్ మాట్లాడుతూ...

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మానవ నిర్లక్ష్యమేనని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించకపోవడం వంటి వాటివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు.అనంతరం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిరంతరంగా నిర్వహిస్తూ గ్రామాలు, పట్టణాలు, బ్లాక్ స్పాట్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, యువతే మార్పుకు నాంది పలకాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో ఎస్త్స్రలు వెంకటేశ్వర్లు, గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.