calender_icon.png 23 October, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలి

17-10-2025 12:18:34 AM

షేక్‌పేట్ ఓయూ కాలనీలో కార్యకర్తల సమావేశంలో నేతలు

హైదరాబాద్/షేక్‌పేట్, అక్టోబర్ 16(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ రాజేందర్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం గురువారం నార్సింగి మున్సిపల్ అధ్యక్షుడు విష్ణు వర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో షేక్‌పేట్‌లోని ఓయూ కాలనీలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాజేందర్‌నగర్ మైనార్టీ ఇన్‌చార్జి షేక్ ముక్తా ర్ పాల్గొన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహరచన, ప్రణాళికలపై కీలక చర్చలు జరిగాయి.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇం ద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి నాయకత్వం వహించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక స్థా యిలో కార్యకర్తల చైతన్యం, ప్రజలతో అనుసంధానం, రాబోయే ఎన్నికల విజయానికి దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నేతలు ప్రజలతో సన్నిహితంగా ఉం డి పార్టీ బలం పెంచాలని పిలుపునిచ్చారు.