17-10-2025 12:19:21 AM
మాగనూరు అక్టోబర్ 16. మాగనూరు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివా సులు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు,
భూభారతి ప్రో గ్రాం లో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి లో వచ్చి న దరఖాస్తులను పరిష్కరించాలి. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేష్ కుమార్ రెవిన్యూ సిబ్బంది ప్రజలుపాల్గొన్నారు.