calender_icon.png 17 May, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణ దారులను అడ్డుకునే దిశగా కృషి

17-05-2025 01:14:31 AM

- మున్సిపల్ భూమిని కాజేసిన ఇద్దరిపై కేసు ఒకరి అరెస్ట్

- వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్, మే 16 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపే దిశగా ఆక్రమణ దారులను అడ్డుకునే దిశగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ లోని మున్సిపల్ స్థలాన్ని ఆక్ర-మించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేయడం జరిగింది.

ఈ మేరకు డిఎస్పీ జీవన్ రెడ్డి శుక్రవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ కు చెందిన  ఏ2 అక్రమ్ భుక్తాపూర్ కాలనీలోని మున్సిపాలిటీ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలని దురుద్దేశంతో తన బంధువైన సయ్యద్ షాబుద్దీన్ పేరిట  అక్ర మ దస్తావే-జులు సృష్టించి మున్సిపాలిటీ ద్వారా 35 సంవత్సరములుగా నివసిస్తున్నాను అంటూ అక్రమ పద్ధతిలో హౌస్ నంబర్ ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ కమీషనర్ రాజు అతనిపై ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ్, సయ్యద్ షాబుద్దీన్‌లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కోట్ల విలువ చేసే మున్సిపల్ భూమిని సదరు వ్యక్తులు కాజేయడంలో, మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర పై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, ఒకవేళ మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర తెలీనట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.

నిందితుల్లో షాబుద్దీన్ ను అరెస్ట్ చేయగా, అక్రమ్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి తెలిపారు. ప్రభుత్వ, మున్సిపాలిటీ భూముల ను కబ్జా చేయాలని ఆక్రమించాలని అక్రమ పద్ధతులలో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి పై ఖబర్దార్ అంటూ డిఎస్పి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.