calender_icon.png 17 May, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడగొట్టు వాన!

17-05-2025 01:14:20 AM

  1. అన్నదాత ఆగమాగం 

తడిసి ముద్దయిన ధాన్యం 

మహబూబాబాద్, మే 16 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షం రైతులను మళ్లీ ఇబ్బందికి గురి చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఎం డకు ఎండిన ధాన్యం రేపో మాపో కాంట వే యడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు మళ్లీ తడిసి రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గూడూరు మండ లం మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది.

ఇందులో అత్యధికంగా దంతాలపల్లి లో 43.2, కురవి మండలంలో 40.2, నరసింహుల పేటలో 40.0, చిన్న గూడూరు, నెల్లికుదురు మండలాల్లో 13.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యా ప్తంగా 207.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా ధాన్యం కొనుగోలు పూర్తికాగా, ఇంకా పలు మండలాల్లో ధాన్యం కొనుగోళ్ళు ‘సాగు’తున్నాయి.

నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడగా, గురువారం రాత్రి ఉన్నట్టుండి వర్షం కురవడంతో ధాన్యం తడిసి త మను ఆగం చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటను విక్రయించే సమయంలో చెడ గొట్టు వాన చెడ తిప్పలు పెడుతోందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కురవి, నర్సింహుల పేట, దంతాలపల్లి మం డలాల్లో వర్షం కారణంగా ధాన్యం బాగా తడిసిపోయింది.

మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. బంజర గ్రామంలో చెట్టుపై పిడుగు పడి నిలువునా దహించుకుపోయిం ది.

అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు విద్యు త్తు లైన్లను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు.

ఎండుడు తడుసుడు!

20 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించడానికి చూపిస్తే తేమ ఉందని చెప్పారు. బాగా ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేసి కాంటా పూర్తి చేశారు. 200 బస్తాల ధాన్యాన్ని ఇక మిల్లులకు తరలించాల్సి ఉంది. ఇంతలో వర్షం కురిసి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఏం తిరకాసు పెడతారో ఏమిటో.. దాన్యం ఎండుడు.. తడుసుడుతోనే సరిపోతోంది. చెడగొట్టు వాన చెడ తిప్పలు పెడుతోంది.

గుగులోతు మల్లమ్మ, రైతు, ముంగిమడుగు, నరసింహుల పేట