05-11-2025 12:14:53 AM
-200 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఆరెకపూడి గాంధీ
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి
శేరిలింగంపల్లి, నవంబర్ 4(విజయక్రాంతి): ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 200 మంది మైనారిటీ మహిళ సోదరీమణులకు కుట్టు మిషన్లను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి తో కలిసి 200 మంది లబ్దిదారులకు అందచేసిన పీఏసీ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహిళలు తమ స్వంత కాళ్ళపై నిలబడి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ రీజినల్ ఆఫీసర్ కులకర్ణి, ఏజీఏమ్ పాసరి, షాజియా బేగం, నజియా బేగం,మాజీ కౌన్సిలర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.