05-11-2025 12:16:25 AM
ములుగు, నవంబర్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి (ఎన్హెచ్) బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా బుధవారం ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వాన దారులు సహకరించాలని నేషనల్ హైవే ఏఈ చైతన్య మంగళవారం తెలిపారు.
కెనాల్ వద్ద రోడ్డు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా వాహనాల రాకపోకలతో ఇబ్బందులు జరుగుతున్నందున ఒక్కరోజు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ములుగు నుండి హనుమకొండ వెళ్లే వాహనాలు భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలని, అదేవిధంగా హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు గూడెపాడ్ వయా పరకాల మీదుగా చిన్న వాహనాలు శ్రీనగర్ భూపాల్ నగర్ మీదుగా ములుగు వెళ్లాలని ఆయన తెలిపారు. వాహనాలదారులు సహకరించాలని ఆయన కోరారు.