05-11-2025 12:14:49 AM
కన్నాయిగూడెం, నవంబరు4 (విజయక్రాంతి): తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కంతనపల్లి రైతులు పాల్గొనడం జరిగింది. పాల్గొన్న రైతులకు మంత్రి ఆయిల్ పామ్ పంట సాగు వివరాలు భూసార పరీక్ష పత్రాల ఆవశ్యకతను రైతులకు పలుసూచలు వివరించారు.
అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు ఏటూరునాగారం జే అవినాష్ వర్మ మరియు వ్యవసాయ అధికారి ముంజ మహేష్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశాల మేరకు కంతనపల్లి రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ చేయడం జరిగింది, అంతేకాకుండా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం గురించి రైతులకు వివరించడం జరిగింది.
ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోవిందరావుపేట్ కె జితేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు కళ్యాణి, ప్రియాంక మరియు రైతులు పాల్గొనడం జరిగింది.