calender_icon.png 14 November, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

14-11-2025 12:18:44 AM

పాట్నా, నవంబర్ 13 : అందరి దృష్టి బీహార్‌పైనే ఉంది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చివరిపర్వం కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నా రు. ఎగ్జిట్ ఫలితాలు నిజమౌతాయా.. బీహార్ ఓటరు తీర్పు మరోలా ఉంటుందా తేలనుంది.

రాష్ట్రంలో రెండవ దశ పోలింగ్ 66.91 శాతంగా రికార్డు స్థాయిలో నమోదైంది. 1951 నుంచి రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ఓటింగ్ శాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. రెండవ దశలోని 66.91 శాతం ఓటింగ్‌లో మహిళా ఓటర్లు 17.6 శాతం ఉన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మరోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండగా, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ నాయకత్వంలో గెలుపు ఖాయమని మహాఘట్బంధన్ భావిస్తున్నది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.